Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి రూ.4.14కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. క్షేత్రంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో పటిష్ఠమైన నిఘానేత్రాల మధ్య ఆలయ అధికారులు సిబ్బందితో పాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు. గత 26రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.4,14,15,623 ఆదాయంగా వచ్చిందని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. అలాగే, 322.300 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 8.520 కేజీల వెండి ఆభరణాలు కానుకగా సమర్పించారని తెలిపారు. యూఎస్ డాలర్లు 739, యూఏఈ థిర్హమ్స్ 50, ఈ-రోస్ 20, ఆస్ట్రేలియా డాలర్లు 135, కెనడా డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 205, ఖతార్ రియాల్స్ 61, ఒమన్, మలేషియా, బహ్రెయిన్ దినార్, ఉగాండ, జపాన్, మెక్సికో తదితర దేశాలకు చెందిన కరెన్సీని సైతం భక్తులు కానుకగా సమర్పించారని ఏఈవో హరిదాస్ వివరించారు.