తిరుమల : (Tirumala Vahana seva) కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పెద శేష వాహనంపై ఊరేగించారు. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.
పెద్ద శేష వాహనంపై కొలువుదీరిన దేవదేవుడు మానవుల్లోని కల్మశాన్ని హరిస్తాడని ఈ సేవ అంతరార్థం. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. స్వామి వారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తుంటాడు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ రమేశ్‌బాబు, పేష్కార్ శ్రీహరి, వీజీఓ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..