Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు.. ఆదివారం నాడు ఏపీలోకి ప్రవేశించాయి. కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
కాగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.