(TTD Good News) చిత్తూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. త్వరలో స్వామి వారిని దర్శించుకేందుకు భక్తుల సంఖ్య పరిమితిని పెంచనున్నట్లు టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. వర్షాల కారణంగా జాగ్రత్తగా ఉండాలని భక్తులకు సుబ్బారెడ్డి సూచించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను పరిమితం చేశారు. అయితే, కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో భక్తుల పరిమితిని పెంచేందుకు టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే దీనిపై స్పష్టత ఇస్తామన్నారు. అదేవిధంగా సర్వదర్శనం టోకెన్లు ఎలా ఇవ్వాలనే దానిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, ప్రస్తుతం మాత్రం దర్శనం టోకెన్లను ఆన్లైన్లోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా నడక దారిలో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భక్తులు జాగ్రత్తగా నడిచి కొండెక్కాలని సూచించారు. వర్షాలు తగ్గిన తర్వాత నడక దారిలో సమస్యలను పరిష్కరిస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
షుగర్‌ను ఇలా అదుపులో పెట్టుకోవాలి..! ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..