హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఏపీ శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బీజేపీకి కేటాయించింది.
దీంతో శాసనమండలిలో వైసీపీ, టీడీపీకి ఫ్లోర్ లీడర్లు ఉండగా, బీజేపీకి లేరు. ఈ నేపథ్యంలో ఈ పదవికి సోము వీర్రాజును తాజాగా ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.