(TTD Solar Plant) న్యూఢిల్లీ : విద్యుత్ కష్టాల నుంచి బయటపడే మార్గాలను ఆన్వేషించడంతోపాటు వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీ ఆవరణలో సోలార్ ప్లాంట్‌ను నెలకొల్పారు. ఈ ప్లాంట్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం ప్రారంభించారు. 139 కేవీఏ సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్‌కు రూ.11.50 చెల్లిస్తుండగా.. ఇప్పుడు ఈ సోలార్ పవర్ ప్లాంట్‌తో యూనిట్ ఖర్చు రూ.3.33 కు తగ్గనున్నదని అధికారులు చెప్పారు. మొత్తం మీద కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్ష వరకు తగ్గనున్నది.
శ్రీవెంకటేశ్వర కళాశాల భవనం పైకప్పును సోలార్ పవర్ ఉత్పత్తి చేసే సంస్థకు ఇచ్చామని, విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ నిర్వహణ మొత్తం ఆ సంస్థ చూసుకుంటుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనం ఈ ఒక్క ప్లాంటుతో కలుగుతుందని పేర్కొన్నారు. సోలార్ ప్లాంట్‌తో ఆదా అయ్యే విద్యుత్తు బిల్లు సొమ్మును ప్రత్యేకంగా దాచిపెట్టమని చెప్పానని, ఆ నిధులతో కాలేజి హాస్టల్ భవంతులపై సొంతంగా పవర్ ప్లాంట్ పెట్టాలని యోచిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గతంలో మాదిరిగా సీట్లను రిజర్వ్ చేయమని ఢిల్లీ యూనివర్శిటీని కోరతామని, తద్వారా ఢిల్లీలో ఉంటున్న తెలుగువారికి ప్రవేశాలు దొరుకుతాయని ఆయన తెలిపారు.
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..