అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన దవాఖానకు చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ఘటనా స్థలంలోనే ఐదుగురు మరణించారని, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారని తెలిపారు. మృతుల్లో రెండు లారీల డ్రైవర్లు కూడా ఉన్నారని చెప్పారు. చనిపోయినవారిలో ఐదుగురు పశ్చిమగోదావరి జిల్లా తాళ్లరేవు వాసులు ఉన్నారని వెల్లడించారు.
ఐషర్ వాహనం కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వస్తుండగా, లారీ పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్నదని తెలిపారు. ఐషర్ వాహనంలో డ్రైవర్‌తోపాటు 10 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. లారీలో డ్రైవర్‌తోపాటు మరో ప్రయాణికుడు ఉన్నాడని చెప్పారు.