Srisailam | ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఐజీపీ ఆర్కే రవికృష్ణ సమీక్ష నిర్వహించారు. శ్రీశైలంలోని పరిపాలన విభాగంలోని మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరిగింది.
మోదీ పర్యటన సందర్భంగా హెలీప్యాడ్లు, రూట్ బందోబస్తు, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన పికెట్లు, చెక్‌పోస్టులతో పాటు ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఐజీ ఆదేశించారు.
ఈ సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, గ్రేహౌండ్స్ డీఐజీ బాపూజీ, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీజీపీ కార్యాలయం అధిరాజ్ సింగ్ రాణా, ఈజీ అశోక్ కుమార్, సీఐడీ ఎస్పీ శ్రీధర్‌రావు, అదనపు ఎస్పీ యుగంధరబాబు, ఆత్మకూరు డీఎస్పీ రాంజీ నాయక్, శ్రీశైలం సీఐ ప్రసాద్‌రావు, ఎస్సైలు పాల్గొన్నారు.