అమరావతి : ఏపీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు (Inter Exam Fee) చెల్లింపునకు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి -2025లో పరీక్షలు రాయనున్న ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈనెల 21 నుంచి నవంబర్ 11 వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్యామండలి(Higher Eduction) కార్యదర్శి కృతికా శుక్లా (Kruthika Shukla) తెలిపారు.
వెయ్యి రూపాయల ఆలస్య రుసుంతో నవంబర్ 20వ తేదీ వరకు అవకాశం కల్పించామని వెల్లడించారు. ఇకపై గడువు అవకాశం ఉండదని అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్(College Principals) కు సూచించామని వివరించారు. ఇంటర్ పరీక్షలు ప్రైవేటుగా రాయదలిచిన విద్యార్థులకు అటెండెన్స్ మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వచ్చే నెల 15 వ తేదీ వరకు రూ. 1500, నవంబర్ 30 వరకు పెనాల్టీతో రూ. 500 ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు.