Rain : రాగల మూడు గంటల్లో ఏపీలోని మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన కురుస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం పడనుందని చెప్పారు.
పిడుగుల వాన పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్త వహించాలని, చెట్ల కింద ఆరుబయట నిలబడవద్దని సూచించారు.