అమరావతి : ఆంధ్రుల అతిపెద్ద పండుగైన సంక్రాంతికి (Sankranti) వాతావరణశాఖ వర్షం (Rain effect) హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వెల్లడించింది. ఈ కారణంగా పలు జిల్లాలో వర్షాలు పడుతాయని తెలిపింది.
ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాలో మరో రెండ్రోజులు పొడి వాతావరణం ఉండనుందని తెలిపింది, ఉపరితల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగితే, ఏపీలో చాలా చోట్ల మరో మూడు, నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
దక్షిణ కోస్తా ( South Cost) , రాయలసీమలోని (Rayalaseema) పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని స్పష్టం చేసింది. వైఎస్సార్ (YSR), చిత్తూరు, తిరుపతి ( Tirupati ) , నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో సైతం వర్షాలు కురవచ్చని వెల్లడించింది.
తెలంగాణలో (Telangana) మాత్రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉందని, రాబోయే 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని పేర్కొంది.