Viral Video | బస్సు ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల తీరు మాత్రం మారడం లేదు. ప్రయాణికుల ప్రాణాల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానికి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ తీరే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అద్దం పగిలిన బస్సు నడపడమే కాకుండా.. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే వారికి నిర్లక్ష్యపు సమాధానమిచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీలక్ష్మీనరసింహ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి 9.45గంటలకు మార్కాపురం నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే బస్సు మార్కాపురం కోర్టు కూడలికి వచ్చిన తర్వాత 36 మంది ప్రయాణికులు దాని వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలోనే బస్సు ముందు అద్దం పగిలిపోయి ఉందని ప్రయాణికులు గుర్తించారు. అద్దం లేకుండా ఎలా వెళ్తారని డ్రైవర్లు మస్తాన్, రసూల్‌ను ప్రయాణికులు ప్రశ్నించారు.
ప్రయాణికుల ప్రాణాలు అంటే మరీ ఇంత నిర్లక్ష్యమా!
అద్దం పగిలితే ఏంటి హెల్మెట్ పెట్టుకొని నడుపుతాం
ఆదివారం రాత్రి మార్కాపురం నుండి బెంగళూరు బయల్దేరిన బస్సు ముందు అద్దాలు పగిలి ఉండగా ఎలా నడుపుతారు అంటూ ప్రశ్నించిన ప్రయాణికులకు అహంకారంతో సమాధానం ఇచ్చిన శ్రీలక్ష్మినరసింహ ప్రైవేట్… pic.twitter.com/Xpov5UBgnt
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2026
అందుకు ప్రైవేటు బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంతో అహంకారంగా సమాధానమిచ్చారు. అద్దం పగిలితేనేం? హెల్మెట్ పెట్టుకుని బస్సును నడుపుతామని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్‌తో వాదనకు దిగారు. ఇంతలో డ్రైవర్ బస్సు స్టార్ట్ చేయడంతో ఇంజిన్ నుంచి శబ్దం తేడాగా వచ్చింది. దీంతో ప్ రయాణికులు వేరే బస్సు ఏర్పాటు చేయాలని మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ జరపగా.. రెండు రోజుల క్రితమే ఆ బస్సుకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది. దీంతో ఆ బస్సును సీజ్ చేశారు.