అమరావతి : ఏపీలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటనలో 33 మంది ప్రయాణికులు (Passengers safe) సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు (Private bus) ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగోలు వద్ద ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బస్సు డ్రైవర్ (Driver) అప్రమత్తమై ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా బయటకు పంపించారు. దీంతో బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసారు. ఈ ప్రమాదంతో బస్సు పూర్తిగా కాలిపోయింది.