Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎంగా (AP Deputy CM) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం బాధ్యతలు తీసుకున్నారు (took charge). విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగానూ పవన్ బాధ్యతలు చేపట్టారు.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా మంగళవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు, కూటమి నాయకులు, ఉద్యోగులు పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న పవన్‌కు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఇద్దరూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మరోవైపు పవన్ కల్యాణ్ భద్రతను కూడా ఏపీ ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. వై ప్లస్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్‌ప్రూఫ్ కారును కేటాయించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన @PawanKalyan గారు. #PawanKalyan @JanaSenaParty pic.twitter.com/vBpaPfm5sL
— Pawanism Network (@PawanismNetwork) June 19, 2024
Also Read..
Earthquake | ఇరాన్‌ను వణికించిన భూకంపం.. నలుగురు మృతి
Harish Rao | నాణ్యమైన విద్య అందించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం : హరీశ్ రావు