అమరావతి : విద్యార్థి దశ అత్యంత కీలకమని, ఈ వయస్సులో పిల్లల చదువులు, అలవాట్లపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu) తల్లిదండ్రులకు సూచించారు. ఏపీ వ్యాప్తంగా శనివారం మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్‌ను(Mega Parents, Teachers meet) నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ బాపట్ల జిల్లాలో, కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawabkalyan) పాల్గొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించారు.
చంద్రబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మానవ సంబంధాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ నుంచి విద్యార్థులు, యువకులు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. కొందరు డ్రగ్స్‌ను కూరగాయ పంటలా సాగు చేస్తున్నారని, ఈగల్(Eagle) పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థ ద్వారా డ్రగ్స్ (Drugs) రక్కసిని ఖచ్చితంగా అణిచివేస్తామన్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని, మీ పనుల్లో మీరుండి పిల్లల చదువును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది : పవన్‌కల్యాణ్
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తుందని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. చదువుకోవడం ఉద్యోగం, ఆస్తులు పెంచుకోవడానికి కాదని జ్ఞానం పెంచుకోవడానికని అన్నారు. ప్రతి ఒక్కరిలో జాతీయభావం కలిగి ఉండాలని సూచించారు. పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయని, ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకుంటే సమస్యను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.