అమరావతి : విజయవాడ(Vijayawada), పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు (Landslide) విరిగిపడుతున్నాయి. నాలుగురోజుల క్రితం కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందిన ఘటనను మరవకముందే తాజాగా మంగళవారం మధ్యాహ్నం మరో ఘటన జరిగింది.
విజయవాడ మాచవరం (Machavaram) వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్లను నలుగురు కార్మికులు తొలగిస్తుండగా ఒక్కసారిగా కొండచరియపై ఉన్న బండరాయి కార్మికులపై పడింది. ఈ ఘటనలో బండరాయి కింద ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు(Mla Gadde Rammohanrao) , ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు.