హైదరాబాద్ : (Electric Buses) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు త్వరలో విద్యుత్ బస్సులు పరుగులు తీయనున్నాయి. వాయు కాలుష్యాన్ని నివారించడానికి ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నది. ఒకేసారి 100 ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేయనున్నది. ఈ బస్సులను తయరుచేసే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. రూ.140 కోట్లతో దశలవారీగా ఏడాది కాలంలో ఈ 100 బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ ఏపీఎస్ఆర్టీసీకి అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు లెటర్ ఆఫ్ అవార్డ్‌ను ఈ కంపెనీకి అందజేశారు.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ ఈ కాంట్రాక్ట్‌ను ఒలెక్ట్రా గ్రీన్విచ్ సంస్థకు అప్పగించింది. కొత్తగా అప్పగించిన ఈ కాంట్రాక్ట్‌తో ఏపీఎస్ఆర్టీసీ ఆధీనంలోకి రానున్న ఎలక్ట్రిక్ ఆధారిత బస్సుల సంఖ్య 1,450కి చేరుతుంది. ఈ బస్సులను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల దూరం వరకు రాకపోకలు సాగించగలుగుతాయి. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు పొడవు తొమ్మిది మీటర్లు ఉంటుంది. సీట్ల సామర్థ్యం 35. లిథియం-ఆయాన్ బ్యాటరీ ఆధారంగా ఇవి నడుస్తాయి. ఈ బ్యాటరీ ఛార్జ్ కావడానికి 3 గంటల సమయం పడుతుంది. అడ్వాన్స్ బ్రేక్ సిస్టంను ఈ బస్సులు కలిగి ఉంటాయి.
అద్దెప్రాతిపదికన విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతిలో మొత్తం 350 విద్యుత్ బస్సులను నడపడానికి ఇదివరకే ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన బస్సులను నడిపించడానికి ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలిచారు. ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ బిడ్డింగ్స్ దాఖలు చేశాయి. ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో కొన్ని బస్సులను నడిపించడానికి ముందుకొచ్చింది. సొంతంగా బస్సులను సమకూర్చుకోవడానికి కొత్తగా ఈ కాంట్రాక్ట్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు అప్పగించారు.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..