Srisailam | శ్రీశైలం : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం శ్రీశైలం క్షేత్రంలో జ్వాలాతోరణోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే భద్రతా ఏర్పాట్లను నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గురువారం మధ్యాహ్నం పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శ్రీశైలంలో సాయంత్రం జరిగే జ్వాలాతోరణం కార్యక్రమం భద్రతా ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందని తెలిపారు. భక్తులు కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలు, దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడళ్లలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు సూచికల బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పుణ్య స్నానాలు ఆచరించడానికి విచ్చేసే భక్తులు, యువకులు పోలీసుల హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. భక్తులు వారితోపాటు వారి పిల్లలను పుణ్యస్నానాలు ఆచరించడానికి తీసుకుని వచ్చినప్పుడు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. పోలీసు వారి సూచనలు పాటిస్తూ, ఆనందంగా, ఆహ్లాదకరంగా పుణ్య స్నానాలు ఆచరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్, ఇన్స్పెక్టర్ ప్రసాదరావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు.. పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు : కేటీఆర్
KTR | ఇప్పుడు కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది.. రేవంత్‌ను హెచ్చరించిన కేటీఆర్
KTR | కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి.. కేవలం బీఆర్ఎసోళ్లనే జైల్లో వేశారు : కేటీఆర్