Minister Srinivas Yadav | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను మానాలి : మంత్రి తలసాని
Minister Srinivas Yadav | వైజాగ్ (Vizag) స్టీల్ ప్లాంట్ (Steel plant)ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని, ఆ ఆలోచనను మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మంత్రిని వెస్ట్ మారేడ్‌పల్లిలోని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
Minister Srinivas Yadav | వైజాగ్ (Vizag) స్టీల్ ప్లాంట్ (Steel plant)ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని, ఆ ఆలోచనను మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Srinivas Yadav ) సూచించారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ లక్షలాది మంది బతుకులను రోడ్డున పడేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతోమంది పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించకుండా, రా మెటీరియల్ సరఫరా చేయకుండా పరిశ్రమను నష్టాల్లోకి తీసుకెళ్లి.. ప్రైవేట్ పరం లేదంటే.. తన కార్పోరేట్ అనుచరుల పరం చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. 780 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా, పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. మంత్రిని కలిసిన వారిలో పరిరక్షణ కమిటీ సభ్యులు రాజ, శివ, శ్రీరామ్, సునీల్, మురళి, హరీశ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

