(Minister Perni Nani) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫి చట్టం ప్రకారమే సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించామని మంత్రి పేర్ని నాని చెప్పారు. 1955 నుంచి కూడా ఇదే కొనసాగుతున్నదన్నారు. సోమవారం దర్శకుడు రాంగోపాల్ వర్మ తనతో భేటీ అనంతరం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎవరైనా కమిటీ ముందుకు వచ్చి సలహాలు ఇవ్వవచ్చునని వెల్లడించారు.
ఏపీ సినిమాటోగ్రఫి చట్టం ప్రకారంమే సినిమా టికెట్ల రేట్లను పెంచడంపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఏమీ చేయలేదని తెలిపారు. 2013 లో ఇచ్చిన జీఓ 100 లో పేర్కొన్న రేట్ల కంటే పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. 2010 లో ఇచ్చిన జీవో లో కంటే కూడా రేట్లు పెంచి జీవో 35 ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. మా ప్రభుత్వం కొత్తగా సృష్టించింది ఏదీ లేదనీ, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదనీ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదనీ, చట్టం అందరికీ ఒక్కటే అన్నారు.
టికెట్ల రేట్లు సరిపోవడం లేదని, టికెట్ రేట్లు సహేతుకంగా లేవని ఎవరికైనా అనిపిస్తే కమిటీ ముందుకు వచ్చి చెప్పొచ్చునని మంత్రి పేర్ని నాని సూచించారు. ఎవరైనా నేరుగా కమిటీ ముందుకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వొచ్చునన్నారు. కమిటీ రేపు కూడా సమావేశమవుతుందని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం ఉంటుందన్నారు. కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్నదనే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల విడుదలను వాయిదా వేసుకుని ఉంటారని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..