అమరావతి : కర్నూలు జిల్లా ఉడ్‌లాండ్ లాడ్జిలో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. లాడ్జి (Lodge) నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. చనిపోయిన వారిని నందికొట్కుర్కు చెందిన విజయ్(32), రుక్సానా(38) గా గుర్తించారు. రుక్సానాను హత్యచేసిన అనంతరం విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రుక్సానా(38) కు ముగ్గురు పిల్లలున్నారు. విజయ్ ఆత్మహత్య అనంతరం రుక్సానా పిల్లలకు ఫోన్‌చేసి సమాచారం అందించాడని పోలీసులు(Police) తెలిపారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధముందని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.