తిరుపతి: తిరుమలలో (Tirumala) చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి. చిరుతపులి వాటిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అందులోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తిరుమలలో మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు చిరుత జాడను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. గతేడాది తిరుమలలో చిరుత దాడిలో ఆరేండ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఆరు చిరుతలను బంధించి జూపార్క్‌కు తరలించారు.