అమరావతి : ఏపీ రాజధానిగా అమరావతి ( Amaravati ) కి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ కూటమి ప్రభుత్వం శనివారం అసెంబ్లీ ( AP Assembly ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandra Babu ) రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఏపీ ప్రభుత్వం అమరావతి రాజధాని అంశంపై అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం కొన్ని సవరణల చేసి మరోసారి అసెంబ్లీ సమావేశం తీర్మానం చేసి పంపాలని ఇటీవల కేంద్రం ఏపీకి సూచించింది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో విభజన చట్టంలోని సెక్షన్ 5లోని సబ్‌సెక్షన్ 2లో ‘ఎట్ అమరావతి ’ పదం చేర్చాలని , సీఆర్డీఏ -2014 ప్రకారం క్యాపిటల్ సిటీ ప్రాంతాలతో సహా అమరావతిని చేర్చాలని కోరుతూ తీర్మానంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశంలో దాదాపు 20 మంది సభ్యులు మాట్లాడారు.
స్పీకర్‌తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, వంగలపుడి అనిత, నారా లోకేష్, విష్ణు కుమార్ రాజు, తదితరులు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ సర్వనాశనం అయిందని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా వైఎస్ జగన్ కుట్ర చేశారని విమర్శించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని , అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమని మంత్రి లోకేష్ అన్నారు.