Konaseema Collector | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి సంబురాల్లో భాగంగా పడవ పోటీల నిర్వహణ సన్నాహకాలను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ మహేశ్‌కుమార్.. అదుపు తప్పి నీటిలో పడిపోయారు. అక్కడే ఉన్న ఈతగాళ్లు ఆయన్ను రక్షించి, వేరే పడవలోకి ఎక్కించారు.
సంక్రాంతి సంబురాల్లో భాగంగా ఆత్రేయపురం మండలం పులిదిండిలో పడవ పోటీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ట్రయల్ రన్ పోటీలను శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ వెళ్లారు. ఈ క్రమంలోనే అదుపుతప్పిన ఆయన కాల్వలో పడిపోయారు. అక్కడ ఉన్న ఈతగాళ్లు వెంటనే అప్రమత్తమై కాల్వలో దూకి ఆయన్ను రక్షించారు. అనంతరం వేరే పడవలోకి ఎక్కించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.