శ్రీశైలం : (Srisailam) కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో శ్రీశైలంకు వస్తున్నారు. శ్రీశైలంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం నిర్వహించిన లక్ష దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కార్తిక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో భక్తులు శ్రీశైలంకు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ పురవీధుల్లో కార్తిక దీపారాధనలు చేశారు. ఇక్కడ కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రద్దీతో ఆలయం క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. సోమవారం సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువలా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించడంతో ఆలయం స్వర్ణకాంతులతో వెలుగొందింది.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..