అమరావతి : తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu) వివాదంపై వైసీపీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) లేఖ ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) కి లేఖ రాశారు. వాస్తవాలు నిగ్గుతేల్చాలని లేఖలో కోరారు. తన రాజకీయాల కోసం చంద్రబాబు(Chandrababu) టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచేవిధంగా మాట్లాడారని, సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని పేర్కొన్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ది చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు.