అమరావతి : వైసీపీ ఐదేండ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి దృష్టిని మరల్చేందుకు వైఎస్ జగన్ (YS Jagan) ఢిల్లీలో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని టీడీపీ(TDP) పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు (Lau Srikrishna Devarayalu) ఆరోపించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్రం అఖిలపక్ష నాయకులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తామని వెల్లడించారు. అదేవిధంగా ఐదేండ్లలో వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని సైతం లేవనెత్తుతామని వివరించారు. అమరావతి(Amaravati) , పోలవరం (Polavaram) , తదితర వాటిపై విడుదల చేసిన శ్వేతపత్రాలు, ఆర్థిక, శాంతి భద్రతలు అంశాలపై విడుదల చేసే పత్రాలపై కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షం యత్నిస్తోందని, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించేందుకు ప్రతిపక్షం యత్నిస్తుందని ఆరోపించారు. అమరావతి రాజధాని, విశాఖ స్టీల్‌ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులపై కూడా అఖిలపక్షంలో చర్చించామని పేర్కొన్నారు.
Vizag | విశాఖ మేయర్ పీఠం కూటమిదే.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు