Vizag | విశాఖ మేయర్ పీఠం కూటమిదే.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Vizag | విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి ప్రభుత్వం భారీగా చేరికలకు తెరలేపింది. ఈ విషయాన్ని విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. 20 మంది వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Vizag | విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి ప్రభుత్వం భారీగా చేరికలకు తెరలేపింది. ఈ విషయాన్ని విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. 20 మంది వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జనసేనలో ఏడుగురు, టీడీపీలో 13 మంది చేరుతున్నారని వెల్లడించారు. ఇకపై విశాఖ మేయర్ పీఠం కూటమిదేనని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ నుంచి చాలామంది కార్పొరేటర్లు కూటమిలోకి వస్తామంటున్నారని వంశీకృష్ణ తెలిపారు. మేం తలుపులు ఎప్పుడు తెరుస్తామా అని వారంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. కానీ తాము మాత్రం కొందరినే తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో అవకాశాలు లేనివాళ్లే వైసీపీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విశాఖ మేయర్ పీఠం ఇకపై తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా తమ పాలన ఉంటుందని తెలిపారు.
వైసీపీ నుంచి తమ పార్టీలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. చేరికలపై కార్యకర్తల నుంచి అభ్యంతరాలు కూడా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ప్రస్తుతం జీవీఎంసీలో ఉన్న 98 కార్పొరేటర్లలో టీడీపీకి 27 మంది కార్పొరేటర్లు ఉన్నారు. జనసేనకు ముగ్గురు, బీజేపీకి ఒకరు, ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. ఇంకా జీవీఎంసీ పరిధిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మొత్తంగా కూటమికి 45 మంది మద్దతు ఉంది. మరో ఐదుగురు సభ్యుల మద్దతు ఉంటే జీవీఎంసీలో కూటమికి మెజారిటీ లభిస్తుంది. అయినా సరే కౌన్సిల్లో పటిష్టంగా ఉండాలని భావించిన టీడీపీ నేతలు వైసీపీ నుంచి వచ్చేందుకు సిద్ధమైన 22 కార్పొరేటర్లనూ తీసుకోవాలని నిర్ణయించింది.
వైజాగ్ మేయర్ పీఠం కూటమికి వెళ్లేనా?
విశాఖ మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే. ఎందుకంటే.. మేయర్/మునిసిపల్ చైర్మన్ పదవుల్లో ఉన్న వారు నాలుగేళ్లు కొనసాగేలా వైసీపీ ప్రభుత్వం చట్టం చేసింది. అందువల్ల మేయర్ పదవిని టీడీపీ చేజిక్కించుకోవాలంటే అసెంబ్లీలో గతంలో చేసిన చట్టానికి సవరణ చేయాలి. అందుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీలు కైవసం చేసుకోవాలని నిర్ణయించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

