(Jagan Nivali) తాడేపల్లి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ‘సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేడ్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం. ఆదర్శప్రాయం. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చేందుకు అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి’ అని ట్వీట్ చేశారు.
బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పవన్ కల్యాన్ ఒక సందేశాన్ని పంపారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కారణజన్ముడని.. భారత రాజ్యాంగ శిల్పిగా పూజలు అందుకుంటున్న మహనీయుడని పవన్ కొనియాడారు. ఆయన ఆలోచనలు భావితరాలకు అనుసరణీయని పేర్కొన్నారు. అంబేడ్కర్ పట్ల తనకు ఎంతో భక్తి భావం ఉన్నదని.. ఆ భావనతోనే లండన్లో ఆయన నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన స్మారక మందిరాన్ని సందర్శించేలా చేసిందన్నారు. రాజ్యాంగంలో ఆయన కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుయన్నారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..