Suicide : కన్నడ నటి (Kannada Actress), బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ కృషి తపండా (Krishi Thapanda) నివాసంలో ఓ వ్యాపారవేత్త (Business Man) ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బెంగళూరు (Bengalore) లోని ఆర్ఆర్ నగర్లోగల ఆమె అపార్ట్మెంట్లో 33 ఏళ్ల వైశాఖ్ (Vyshak) అనే వ్యాపారవేత్త రాత్రి ఉరివేసుకుని మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం రాత్రి వైశాఖ్ ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటన జరిగిన సమయంలో నటి కృషి ఇంట్లో లేరు. అయితే చనిపోయే ముందు వైశాఖ్ ఆమెకు కొన్ని సందేశాలు పంపారు. వాటిని చూసి ఆందోళనకు గురైన కృషి వెంటనే వైశాఖ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కెంగేరికి చెందిన వైశాఖ్.. నటి కృషికి సన్నిహిత మిత్రుడని, కొంతకాలంగా ఆమె ఫ్లాట్లోనే నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలతోపాటు ఇటీవలే భార్య నుంచి విడిపోవడంతో ఆయన తీవ్ర మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఆయన ఒక ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నట్లు తెలిసింది. కాగా గత ఫిబ్రవరిలో జరిగిన రూ.7 కోట్ల దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న వైశాఖ్.. అప్పట్లో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. ఆర్ఆర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే మృతుడి కుటుంబసభ్యులు వైశాఖ్ మరణంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.