INDW vs BANW | షఫాలీ, జెమీమా మెరుపులు.. సెమీస్ ఆశల్ని నిలబెట్టుకున్న భారత్..!
NDW vs BANW : పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్ ఆశల్ని భారత మహిళల జట్టు నిలబెట్టుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను వణికించింది.
NDW vs BANW : పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్ ఆశల్ని భారత మహిళల జట్టు నిలబెట్టుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను వణికించింది. 137 పరుగుల ఛేదనలో ఓపెనర్ షఫాలీ వర్మ(53) రికార్డు అర్ధ శతకంతో కదం తొక్కగా.. జెమీమా రోడ్రిగ్స్(26) ధనాధన్ ఆటతో లక్ష్యాన్ని కరిగించింది. మిడిలార్డర్ తేలిపోయినా.. అనుభవజ్ఞురాలైన జెమీమా విధ్వంసక ఆటతో బంగ్లా ఓటమి ఖాయం చేసింది. ఫలితంగా సెమీస్ రేసులో అవసరమైన రెండు కీలక పాయింట్లు లభించాయి.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మూడో విజయంతో సెమీస్ రేసులో నిలిచింది. దక్షిణాఫ్రికా చేతిలో అనూమ్య ఓటమిని తొలుత బంగ్లాదేశ్‌ను 136కే కట్టడి చేసిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. స్మృ తి మంధాన(8) ఔటైనా.. షఫాలీ వర్మ(53 )చితక్కొట్టింది. 29 బంతుల్లోనే అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పింది. ఔట్ చేయగా.. యస్తికా భాటియా(23) మరోసారి విఫలమైంది.
బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన రీచా ఘోష్(10).. రెండు ఫోర్లతో అలరించినా ఎల్బీగా వెనుదిరిగింది. నాలుగు వికెట్లు పడిన వేళ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(13 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్(26) నింపాదిగా ఆడారు. అప్పటికీ అవసరైమన రన్స్ 35లోపే ఉండగా.. షంజిదా అక్తర్ ఓవర్లో జెమీమా 6, 4తో రెచ్చిపోయింది. అదే ఊపులో రీతు మోనిని ఉతికేస్తూ వరసగా రెండు బౌండరీలు బాదింది. కానీ, అదే ఓవర్లో మరుఫా చేతికి చిక్కింది. నహిదా అక్తర్ వేసిన 17వ ఓవర్లో దీప్తి శర్మ(5 నాటౌట్), హర్మన్‌ప్రీత్ చెరొక ఫోర్ కొట్టగా.. ఐదు వికెట్లతో టీమిండియా గెలుపొందింది. దాంతో, గ్రూప్ ఏలో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది భారత్.
WT20WC 2026.India Won by 5 Wickets https://t.co/mWgNXcEkp0 #WT20WC26 #TeamIndia
— BCCI Women (@BCCIWomen) June 25, 2026
రాణించిన ఫిర్దౌస్, సుల్తానా
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారీ స్కోర్ కొట్టాలనే పట్టుదలతో ఆడింది. కానీ, రాధా యాదవ్(3-28), శ్రీ చరణి(2-21)లు భారత్ 136 పరుగులకు కట్టడి చేసింది. ఆరంభంలోనే వికెట్ పడినా.. ఓపెనర్ జువారియా ఫిర్దౌస్(33), నిగర్ సుల్తానా(32)లు ధనాధన్ ఆడారు. మిడిల్ ఓవర్లలో రాధా యాదవ్(3-28), శ్రీచరణి(2-21)లు వికెట్లు తీసి పరుగులు నియంత్రించారు. కానీ, ఆఖర్లో షోర్నా అక్తర్(13) మెరుపులతో బంగ్లాదేశ్ మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది. మిష్టిగా రాణించడంతో బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

