తిరుమల : టీటీడీ ( TTD ) లో కీలక పదవులను ఒకే సామాజిక కులానికి చెందిన వారికే కట్టబెడుతున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ(YCP MP) విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఆరోపించారు. కమ్మ కులానికి చెందిన వారినే టీటీడీలోని కీలక పదవుల్లో నియమిస్తున్నారని ఎక్స్ (X Twitter) వేదిక ద్వారా విమర్శలు చేశారు. అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరిని (TTD Additional EO) నియమించారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandra Babu) కమ్మ కులానికి చెందిన వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించ నున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ ప్రతినిధిగా మరో కమ్మను నియమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటు న్నారని దుయ్యబట్టారు. ఇతర కులాల వారు ప్రాతినిద్యానికి పనికి రారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే మాయమవుతాయని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, అధికారంలో ఉన్నప్పుడు మరో విధంగా రెండు నాలుకల ధోరణిని అవలంభించడం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై కాకుండా తన మీద, తన కుటుంబం, డబ్బుమీద దృష్టి మారుతుందని వెల్లడించారు.