తిరుమల : టీటీడీ బోర్టు అదనపు ఈవోగా వెంకయ్యచౌదరి (Venkaiah Chowdhury) శనివారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో ఆయనకు అర్చకులు వేదశీర్వచనం చేశారు. అడిషనల్ ఈవో (Additional EO) కు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు, స్వామివారి ల్యామినేట్ ఫోటో, గో ఉత్పత్తులను అందించారు.
ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వేంకటేశ్వరుని ఆశీస్సులతో అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించారనని పేర్కొన్నారు. అడిషనల్ ఈవోగా తనకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు(Chandra Babu) కు కృతజ్ఞతలు తెలిపారు. యాత్రికులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో ఫీడ్బ్యాక్ మెకానిజం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు, భక్తులకు అత్యంత అంకితభావంతో సేవ చేసేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నాను తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఎస్వీబీసీ షణ్ముఖ్ కుమార్, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డీఈవో లోకనాథం, అధికారులు పాల్గొన్నారు.