అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆబ్కారీశాఖలో(Exciese) జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టనున్నామని మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) వెల్లడించారు. విశాఖ ఆంధ్ర వర్సిటీలో ఎక్సైజ్ ల్యాబ్‌ను ఎంపీ భరత్‌తో కలిసి సందర్శించారు. అనంతరం విశాఖ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
రాష్ట్రంలో మూడు వేల మద్యం దుకాణాలకు 90 వేల దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి మద్యం లాటరీల ద్వారా రూ. 1800 కోట్ల ఆదాయం (Income)వచ్చిందన్నారు. మద్యం ధరల (Liquor Prices) తగ్గింపుపై కమిటీ వేశామని, నాణ్యతపాటు తక్కువ ధరకు మద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. త్వరలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ల్యాబ్‌లో 9 రకాల పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. గతంలో డిస్టిలరీ,తయారీ సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థను వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరానికి కేంద్రం నుంచి రూ. 12 వేల కోట్లు తీసుకొచ్చామని అన్నారు.