అమరావతి : ఏపీలోని పలు ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవుల కారణంగా తిరుమల (Tirumala) తో పాటు శ్రీశైలం ఆలయానికి(Srisailam Temple) భక్తుల తాకిడి రెట్టింపు అయ్యింది. తిరుమలలో కంపార్టుమెంట్లు అన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు ఉన్న భక్తులకు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 66,530 మంది భక్తులు దర్శించుకోగా 32,478 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.66 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు బారులు తీరారు. రద్దీకారణంగా ఈనెల 18 వరకు మల్లన్న స్పర్శదర్శనం నిలిపివేశారు. స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం ఏర్పాటు చేశారు.