నంద్యాల : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ( Srisailam reservoir ) ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం పెరుగుతుంది. జూరాల ( Jurala ) , సుంకేశుల ( Sunkeshula) నుంచి శ్రీశైలానికి 1,71,208 క్యూసెక్కుల నీరు వస్తుంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878.4 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది.
పూర్తి నీటి నిల్వ 215.8 టీఎంసీలకు ప్రస్తుతం 179.89 టీఎంసీల నీరు నిలువ ఉందని అధికారులు వివరించారు. ఈ జలాశయంలోని కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం 67,399 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నామని వెల్లడించారు.