Srisailam | శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన ఎం. మనోహర్ రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. శనివారం ఆలయ ఏఈవో ఫణిధర్ ప్రసాద్, పర్యావేక్షకురాలు హిమబిందుకు విరాళాన్ని చెక్కు రూపంలో అందించగా దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.