తిరుమల: సెలవులు ముగిసినా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లనీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. దీంతో టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటలు పపడుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తున్నది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తున్నది. కాగా, బుధవారం వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నేడు సిఫారసు లెటర్లను తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.
ఇక సోమవారం అర్ధరాత్రి వరకు 75,361 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,850 మంది భక్తులు తలనీలాలు సర్పించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్ల ఆదాయం సమకూరింది.