అమరావతి : ఏపీ (Andhra Pradesh) లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు (Heavy Rains) కురుస్తాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు (Meteorological Department) హెచ్చరించారు. బంగాళాఖాతంతో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారిందని, దీని వల్ల రాగల 48 గంటల్లో ఉత్తర, కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి(East Godavari) , పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.సోమవారం ఏలూరు(Eluru) , అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతాయని వివరించారు. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
వాతావరణ అధికారుల హెచ్చరికల మేరకు ఏపీ విద్యుత్ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల అధికారులను ప అప్రమత్తంచేసి వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా సేవలందించాలని ఆదేశించారు.