Whether Report |వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. వాయవ్య బంగళాఖాతంలో ఏర్పడిన ఈ అల్ప పీడనం రెండు రోజుల్లో మరింత బలహీన పడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అల్ప పీడనం ప్రభావంతో ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూల్, అనకాపల్లి, అనంతపురం, విశాఖపట్నం, సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.
Gold Rates | ఆరు సెషన్లలో జూమ్.. రూ.76 వేలు దాటిన బంగారం ధర..
Nissan X-Trail | భారత్ మార్కెట్లో నిసాన్ ఎక్స్-ట్రయల్ ఆవిష్కరణ..!
Flipkart GOAT Sale | అమెజాన్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్.. 20-25 మధ్య గోట్ సేల్.. ఆఫర్లే ఆఫర్లు..!
Singareni | 20 నుంచి సింగరేణి పరీక్షలకు సర్వం సిద్ధం
Nothing Phone 2a Plus | 31న భారత్ మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ఇవీ డిటైల్స్..!