Srisailam | శ్రీశైలం : శ్రీశైల దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ విభాగంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి రెడ్డి కుటుంబానికి రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్‌ను వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందించారు. తిరుపతిరెడ్డి కొడుకు సూర్యచంద్రారెడ్డి రెండేళ్ల కిందట యాక్సిడెంట్లో రెండు కాళ్ళు దెబ్బతిని మంచానికి పరిమితం అయ్యాడు. రెండు సంవత్సరాలుగా వివిధ హాస్పిటల్స్‌లో తల్లిదండ్రులు వైద్యం చేయిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం వైద్యారోగ్యశాఖ మంత్రి దృష్టికి వెళ్లడంతో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2లక్షల చెక్‌ను విజయవాడలోని చాంబర్లో తిరుపతిరెడ్డికి చెక్‌ను అందజేశారు.