అమరావతి : వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan) యూరప్ (Europe ) వెళ్లేందుకు సీబీఐ కోర్టు ( CBI Court ) అనుమతిచ్చింది . అక్టోబర్ 1 నుంచి 30 మధ్య 15 రోజులు యూరప్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరిగి నవంబర్ 14 లోగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు హాజరై యూరప్ నుంచి ఎప్పుడు వచ్చారో వివరాలు తెలపాలని సూచించింది.
గత యేడాది ఎన్నికల అనంతరం తన ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అనుమతికి నిరాకరించడంతో పర్యటన వాయిదా పడింది . మరోసారి పిటిషన్ దాఖలు చేసుకున్న జగన్ పర్యటనకు కోర్టు అనుమతి మంజూరు చేసింది .