అమరావతి : ఏపీలో ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకు అసెంబ్లీ కి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని సీపీఐ కార్యదర్శి (CPI Secretary) రామకృష్ణ (Ramakrishna) వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సూచించారు. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు అధికార పక్షంలో ఉన్నారని, కాంగ్రెస్, కమ్యూనిస్టుల తరఫున ప్రతినిధులు ఎవరూ లేరని పేర్కొన్నారు.
వైసీపీ నుంచి ఉన్న మీరు అసెంబ్లీకి వెళ్లాలని కోరారు. వైఎస్ జగన్ అసెంబ్లీ ( Assembly ) సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. వైసీపీకి (YCP ) ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు, అసెంబ్లీలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వరని, తాను అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం వృథాయేనని ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.
రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పోస్టింగ్లు దురదృష్టకరమని అన్నారు. ఎవరైనా వ్యక్తిగత దూషణలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.