(Gnanendra Reddy) అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సలహాదారును నియమించుకున్నది. ఇప్పటికే నలుగురు సలహాదారులను నియమించిన జగన్ ప్రభుత్వం.. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డిని కూడా నియమించింది. ఈయన విదేశీ, ప్రవాసాంధ్రులకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వానికి సలహాలు అందిస్తుంటారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిత్తూరు నుంచి 1989, 1991, 1996 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పలమనేరు టికెట్ కోసం ప్రయత్నించారు. అనంతర పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరారు. జ్ఞానేంద్రరెడ్డి సోదరుడి భార్య ప్రమీలమ్మకు కాణిపాకం ఆలయ ట్రస్టుబోర్డు అధ్యక్ష పదవిని ప్రభుత్వం గత ఏడాది కేటాయించింది.
జ్ఞానేంద్రరెడ్డి నియామకాన్ని టీడీపీ తీవ్రంగా నిరసించింది. టీడీపీకి చెందిన నేత గౌతు శిరీష.. ఈ నియామకంపై సెటైర్లు పేలుస్తూ ట్విట్టర్ పోస్టులు పెట్టింది. ‘ఇదే కులాభిమానం అంటే. ఏదైనా ఈ విషయంలో వెనక్కి తగ్గని ఈయన్ని మెచ్చుకోవాల్సిందే. ఎవరేమనుకున్నా డోంట్ కేర్. ఇప్పుడు ఎక్కడున్నారో కులాల మీద నోరు పారేసుకున్న మేధావులు? అంటూ గౌతు శిరీష ప్రశ్నించింది.
యాస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..