హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ9 చాలెంజ్ గోల్ఫ్ నాలుగో సీజన్ టోర్నమెంట్లో వీ సాఫ్ట్ టైటాన్స్, ఆర్డీ ఐరన్ ఈగల్స్ టాప్ ప్లేస్‌లతో నాకౌట్ రౌండ్‌కు చేరుకున్నాయి. సోమవారం ముగిసిన గ్రూప్ దశ తర్వాత టైటాన్స్ 20 మ్యాచ్‌ల్లో పది విజయాలు సాధించి 12 పాయింట్లతో పూల్-ఏలో అగ్రస్థానం సొంతం చేసుకుంది.
బంకర్ బస్టర్స్ (11.5) రెండో స్థానం అందుకోగా.. పార్ టైమర్స్ (11), దసోస్ బై మహీ (10) జట్లు టాప్-4లో నిలిచి ముందంజ వేశాయి. పూల్-బీలో ఐరన్ ఈగల్స్ 12 విజయాలు, 12 పాయింట్లతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. బౌల్డర్ హిల్స్ టైగర్స్ (10.5), ఫెయిర్వే వారియర్స్, హైదరాబాద్ గోల్ఫర్స్ యునైటెడ్ చెరో పది పాయింట్లతో నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాయి.