Mucherla Pharma City | మా భూములపై మీ పెత్తనం ఏంటి?.. అధికారులను నిలదీసిన ముచ్చర్ల ఫార్మాసిటీ రైతులు
Mucherla Pharma City | నష్టపరిహారం చెల్లించకుండా మా భూములపై మీ పెత్తనం ఏంటి?.. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని రైతులు మండిపడ్డారు.
Mucherla Pharma City | కందుకూరు, జూన్ 22: నష్టపరిహారం చెల్లించకుండా మా భూములపై మీ పెత్తనం ఏంటి?.. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని రైతులు మండిపడ్డారు.
సోమవారం ఫార్మాసిటీ బాధిత రైతులు ప్రత్యేక సమావేశమై.. భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో మండల పరిధిలోని ముచ్చరలో జోనల్ అధికారి జ్యోతితో ఆర్ఐ శ్రీకాంత్ వచ్చి ఇటీవల సేకరించిన భూముల్లో మోటర్లు, స్టాటర్లను తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు.
ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని 123వ సర్వే నంబరులోని భూములను తీసుకున్న ప్రభుత్వం.. ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవాలని కోరారు. భూములు కోల్పోయిన వారిలో కొంతమందికే చెల్లింపులు చేసి చేతులు దులుపుకొన్నదని వాపోయారు. భూములు కోల్పోయిన ప్రతి రైతుకూ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫెన్సింగ్ వేసిందే కాకుండా విద్యుత్తు కనెన్షన్లు కూడా ఎందుకు తొలగిస్తున్నారని నిలదీశారు. ఈ వ్యవహారంలో పెద్ద కుంభకోణం దాగి ఉన్నదని ఆరోపించారు. రైతులకు మాజీ సర్పంచ్ తేరేటి లక్ష్మణ్ ముదిరాజ్ మద్దతుగా నిలిచారు. దీంతో ఆర్ఐ శ్రీకాంత్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వారు ఒప్పుకోలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

