గురువారం 26 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 31, 2020 , 18:57:46

శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ

శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల : తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ సేవను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవో  వెంక‌ట‌య్య‌, పోటు పేష్కార్ శ్రీ‌నివాసులు తదితరులు పాల్గొన్నారు.