దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత.. 24గంటల్లో 3.29లక్షల కేసులు..
24గంటల్లో 3.29లక్షల కేసులు.. | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మొన్నటి దాకా నాలుగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మొన్నటి దాకా నాలుగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. నిన్న 3.60లక్షల వరకు తగ్గగా.. తాజాగా 3.30లక్షలకు దిగువన కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,29,942 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,92,517 పెరిగింది. కొత్తగా 3,56,082 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,90,27,304 మంది కోలుకున్నారు. మరో 3,876 మంది మృత్యువాతపడగా.. మహమ్మారి బారినపడి మొత్తం 2,49,992 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 37,15,221 ఉన్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.
మరో వైపు టీకా డ్రైవ్ ముహ్మరంగా సాగుతోంది. టీకా డైవ్ సోమవారం నాటికి 115వ రోజుకు చేరగా.. మొత్తం 17,27,10,066 డోసులు వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. రోజువారీ కేసులు, మరణాల్లో కర్ణాటకలో అత్యధికంగా నమోదయ్యాయి. మొదటి వరకు భారీగా కేసులు నమోదైన మహారాష్ట్ర దేశంలో అత్యధిక కేసుల్లో రాష్ట్రాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. కర్ణాటకలో నిన్న 39,305 కొత్త కేసులు, 596 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 37,236 కేసులు, 549 మరణాలు రికార్డయ్యాయి. మరో వైపు సోమవారం దేశంలో భారీగా కొవిడ్ పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 18,50,110 టెస్టు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 30.56 కోట్లుకుపైగా టెస్టులు చేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
భారత్కు 15 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన ట్విట్టర్
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్
కేరళ తొలి రెవెన్యూ మంత్రి కేఆర్ గౌరీ అమ్మ కన్నుమూత
సముద్ర సేతు-2 వేగవంతం
సన్రైజర్స్ 30 కోట్ల విరాళం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

