రాజమండ్రి : (Fraud at EG) తమ చిన్న చిన్న అవసరాల కోసం దాచుకున్న డబ్బును ఇవ్వకుండా ఆ చిట్టీల వ్యాపారి మోసం చేశారు. కోర్టు నుంచి ఐపీ తెచ్చుకోవడంతో చిట్టీలు కట్టిన వారంతా లబోదిబోమంటున్నారు. దాదాపు రూ.5 కోట్ల వరకు టోకరా వేసినట్లుగా తెలుస్తున్నది.
తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం పట్టణానికి చెందిన కర్రి వీరాంజనేయ భైరవస్వామి అలియాస్ అంజి అనే చిట్టీల నిర్వాహకుడు గత కొంత కాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తన వద్ద చిట్టీలు వేసే వారికి సమయానికి డబ్బులు ఇస్తూ నమ్మకం పెంచుకున్నాడు. అయితే తన వద్ద చిట్టీలు కట్టిన చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలకు తిరిగి డబ్బు చెల్లించకుండా రేపు, మాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. చివరకు కోర్టు నుంచి ఐపీ తీసుకురావడంతో మోసపోయామని చిట్టీలు కట్టిన వారంతా గగ్గోలు పెడుతున్నారు.
తన వద్ద చిట్టీలు కట్టిన దాదాపు 200 మందిని మోసం చేసినట్లుగా తెలిసింది. వీరందరికీ దాదాపు రూ.5 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నదని సమాచారం. ముందస్తు చర్యల్లో భాగంగా తనకు ప్రాణహాని ఉన్నదంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. 116 మంది చిట్టీ బాధితులకు ఐపీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అధికారులు స్పందించి నిర్వాహకుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని చిట్టీదారులు కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై చిరంజీవి తెలిపారు.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..