తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడిపర్రులో విద్యుదాఘాతంతో (Electric Shock) నలుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపర్రులో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహాన్ని సినీ నటుడు సుమన్ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం గ్రామానికి చెందిన బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణ ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు కోమటి అనంరావు తీవ్రంగా పడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం తణుకు ఏరియా దవాఖానకు తరలించారు.
మృతుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సానుభూతి ప్రకటించారు. వారిని అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.